21 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా 114/2 | australia scores 114 runs for the loss of 2 wickets | Sakshi
Sakshi News home page

21 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా 114/2

Jan 16 2015 2:39 PM | Updated on Sep 2 2017 7:46 PM

21 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా 114/2

21 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా 114/2

ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో 21 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.

ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో 21 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 235 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

తొలి వికెట్ను త్వరగానే కోల్పోయిన ఆసీస్.. వాట్సన్ వికెట్ను 71 పరుగుల స్కోరు వద్ద కోల్పోయింది. డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్ క్రీజులో ఉన్నారు. వార్నర్ 63 బంతుల్లో 11 ఫోర్లతో 71 పరుగులు, స్మిత్ 24 బంతుల్లో 9 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement