ఆసీస్దే పైచేయి | Australia lead by 280 runs against new zealand | Sakshi
Sakshi News home page

ఆసీస్దే పైచేయి

Feb 13 2016 7:53 PM | Updated on Sep 3 2017 5:34 PM

ఆసీస్దే పైచేయి

ఆసీస్దే పైచేయి

న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది.

వెల్లింగ్టన్:న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది.147/3 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ను కొనసాగించి ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 463 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ కు 280 పరుగుల ఆధిక్యం లభించింది.

 

తొలుత ఉస్మాన్ ఖాజా(140) భారీ శతకంతో రాణించగా, ఆ తరువాత వోజెస్(176 నాటౌట్) మరో భారీ శతకంతో అజేయం క్రీజ్ లో నిలిచాడు. అతనికి జతగా పీటర్ సిడెల్(29 నాటౌట్) క్రీజ్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ, బౌల్ట్లకు తలో రెండు వికెట్లు లభించగా, కోరీ అండర్సన్, క్రెయిగ్లకు చెరో వికెట్ దక్కింది. శుక్రవారం ప్రారంభమైన టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి రోజే 183 పరుగులకు కుప్పకూలిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement