‘ఆసియా మాస్టర్స్‌’లో దివ్యారెడ్డికి మరో స్వర్ణం | Athlet Divya Reddy Wins Another Gold Medal In Asia Masters Championship | Sakshi
Sakshi News home page

‘ఆసియా మాస్టర్స్‌’లో దివ్యారెడ్డికి మరో స్వర్ణం

Dec 5 2019 10:19 AM | Updated on Dec 5 2019 10:34 AM

Athlet Divya Reddy Wins Another Gold Medal In Asia Masters Championship - Sakshi

కుచింగ్‌: మలేసియాలో జరుగుతోన్న ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 40 ఏళ్ల మహిళల వయో విభాగం 1500మీ. పరుగులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అథ్లెట్‌ బొల్లారెడ్డి దివ్యారెడ్డి  స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు మలేసియాలోని సారావక్‌లో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో దివ్యా రెడ్డి రెండు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. 

40 ఏళ్ల వయో విభాగంలో 800 మీటర్ల కేటగిరీలో విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా... 400 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 800 మీటర్ల ఫైనల్లో దివ్యా రెడ్డి అందరికంటే ముందుగా 2 నిమిషాల 53.64 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా అవతరించింది. గో తెంగ్‌ యిన్‌ (మలేసియా– 2ని:54.15 సెకన్లు) రజతం... అమితా కనెగాంకర్‌ (భారత్‌–2ని:54.73 సెకన్లు) కాంస్యం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement