భారత బాక్సర్లకు నిరాశ | Asian Olympic Qualifiers tournament :- Indian boxers disappointed | Sakshi
Sakshi News home page

భారత బాక్సర్లకు నిరాశ

Mar 27 2016 12:44 AM | Updated on Sep 3 2017 8:38 PM

ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత బాక్సర్లు తొలి రోజు నిరాశపరిచారు.

 షియానాన్: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత బాక్సర్లు తొలి రోజు నిరాశపరిచారు. తొలి రౌండ్‌లో ముగ్గురు బాక్సర్లు బరిలోకి దిగగా అందరికీ పరాజయాలే ఎదురయ్యాయి.

మనోజ్ కుమార్ (64కేజీ) కజకిస్తాన్‌కు చెందిన జుస్సుపోవ్ అబ్లైఖాన్ చేతిలో; సుమిత్ సంగ్వాన్ (81కేజీ) హీగువాన్ యాంగ్ (కొరియా) చేతిలో ఓడారు. మహిళల 75కేజీ విభాగంలో పూజా రాణి తజికిస్తాన్‌కు చెందిన బాక్సర్ షోయిరా జుల్కనరోవా చేతిలో ఓటమి పాలైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement