అంజూబాబీ జార్జ్ రాజీనామా | Anju Bobby George to quit as president of Kerala Sports Council? | Sakshi
Sakshi News home page

అంజూబాబీ జార్జ్ రాజీనామా

Jun 22 2016 3:22 PM | Updated on Sep 4 2017 3:08 AM

గతకొంత కాలంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఈపీ జయరాజన్ వేధిస్తున్నాడని ఆరోపిస్తున్న మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జ్ కేరళ స్పోర్ట్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఈపీ జయరాజన్  వేధిస్తున్నారని ఆరోపిస్తున్న మహిళా అథ్లెట్  అంజూ బాబీ జార్జ్  కేరళ స్పోర్ట్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి బుధవారం రాజీనామా చేశారు.  కేరళ క్రీడా సమాఖ్య సభ్యుల వేధింపులకు తట్టుకోలేకే ఆమె రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
 
అంజూ జార్జ్ తో పాటు మరికొంత మంది కౌన్సిల్ సభ్యులు, వాలీబాల్ క్రీడాకారుడు టామ్ జోసెఫ్ కూడా రాజీనామా చేసినట్టు సమాచారం. గతేడాది ఉమెన్ చాందీ ప్రభుత్వం అంజూ జార్జ్ ను రాష్ట్ర క్రీడా సమాఖ్య అధ్యక్షురాలిగా నియమించింది. క్రీడా బోర్డులో గత కొంత కాలంగా సాగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా అంజు  జార్జ్ గతంలో  క్రీడా మంత్రికి లేఖను కూడా రాశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement