సెలవు ఇవ్వని కంపెనీ.. రాజీనామా చేసిన ఉద్యోగి | Indian Employee Quits Job After Leave Request For Brother Wedding | Sakshi
Sakshi News home page

సెలవు ఇవ్వని కంపెనీ.. రాజీనామా చేసిన ఉద్యోగి

Sep 6 2025 9:08 PM | Updated on Sep 6 2025 9:08 PM

Indian Employee Quits Job After Leave Request For Brother Wedding

అమెరికాలో జరిగే తన సోదరుడి వివాహానికి.. కంపెనీ సెలవు ఇవ్వకపోవడంతో ఉద్యోగం మానేశానని, ఒక భారతీయ ఉద్యోగి రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

అమెరికాలో జరిగే తన సోదరుడి వివాహానికి హాజరుకావడానికి.. మూడు వారాల ముందుగానే, 15 రోజులు సెలవు కావాలని కంపెనీలో పేర్కొన్నాను. అయితే నా అభ్యర్థను కంపెనీ తిరస్కరించింది. ఇప్పుడు నేను పెళ్ళికి హాజరవ్వాలంటే.. రాజీనామా చేయాలి. నాలుగేళ్లు ఎంతో నిజాయితీగా పనిచేసిన నన్ను.. సంస్థ అర్థం చేసుకోలేదు. అందుకే రాజీనామా చేసాను.

నాలుగేళ్లు కంపెనీలో అంకితభావంతో.. తక్కువ జీతానికే పనిచేసాను. అయితే కంపెనీ నాకు సహకరించలేదు. అందుకే వెళ్లిపోవాలని (రాజీనామా) నిర్ణయించుకున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా.. అని రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే నేను రాజీనామా చేసినప్పటికీ.. పెద్దగా ఆర్ధిక భారం (అప్పు) లేదు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. పని కంటే కుటుంబానికే విలువ ఇవ్వడం మంచి నిర్ణయం అని ఒకరు అంటే.. మరొకరు.. జీవితంలో దేన్నైనా రీప్లేస్ చేయొచ్చు, కుటుంబాన్ని రీప్లేస్ చేయలేము అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement