విజేందర్ కెరీర్ నాశనం చేస్తాను.. | Amir Khan Warns He Will 'Ruin Vijender Singh's Career' | Sakshi
Sakshi News home page

విజేందర్ కెరీర్ నాశనం చేస్తాను..

Jul 21 2016 9:35 AM | Updated on Sep 4 2017 5:41 AM

విజేందర్ కెరీర్ నాశనం చేస్తాను..

విజేందర్ కెరీర్ నాశనం చేస్తాను..

తనతో భవిష్యత్తులో బాక్సింగ్ రింగ్‌లో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్ మరోసారి తీవ్రంగా స్పందించాడు.

తనతో భవిష్యత్తులో బాక్సింగ్ రింగ్‌లో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బ్రిటిష్  బాక్సర్ అమీర్ ఖాన్ మరోసారి తీవ్రంగా స్పందించాడు. 'విజేందర్ నాతో పోటీకి సిద్ధమని చాలెంజ్ చేయడం ఏంటి? అతడికి ఇది చాలా తమాషాగా ఉంది. అసలు విజేందర్కు కెరీర్ లేకుండా చేస్తాను' అని అమీర్ పేర్కొన్నాడు. తనలాంటి స్టార్ ఆటగాళ్లతో పోటీకి రెడీ అని వ్యాఖ్యానించేముందు ఎంతో అనుభవాన్ని సంపాదించాలని విజేందర్కు సూచించాడు.

ప్రస్తుతం మిణికట్టు సర్జరీ చేయించుకున్న అమీర్.. విజేందర్ తో పోటీకి తాను సిద్ధమేనని, అయితే ఇంతటి పెద్ద బౌట్లో పాల్గొనాలంటే ఎంతో అనుభవం కావాలని అందుకు కొన్నేళ్ల సమయం పడుతుందన్నాడు. డబ్ల్యూబీఏ లైట్‌వెయిట్ ప్రపంచ చాంపియన్‌గా ఉన్న అమీర్, ఒలింపిక్స్‌లో ఓ రజతం కూడా సాధించాడు. పాకిస్తాన్-భారత్ సంబంధాల తరహాలోనే ఈ బౌట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ క్రేజ్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

వచ్చే 10 బౌట్లు విజేందర్కు సవాల్ విసురుతాయన్నాడు. అతడి ఆటను, బౌట్ కెరీర్ గ్రాఫ్ ను తాను గమనిస్తున్నట్లు వెల్లడించాడు. మా ఇద్దరి మధ్య జరిగే బౌట్ బ్లాక్ బస్టర్గా నిలవడం ఖాయమనీ, అలాకాని పక్షంలో విజేందర్కు తానెప్పుడు మద్ధతిస్తానని పేర్కొన్నాడు. వరుస బౌట్లలో విజయాలతో దూసుకెళ్తోన్న విజేందర్‌ను చిన్నపిల్లాడితో పోల్చుతూ అమీర్ ఇదివరకే ట్వీట్ చేశాడు. విజేందర్ తన కోరిక(అమీర్తో బౌట్) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement