-
విజేందర్ కెరీర్ నాశనం చేస్తాను..
తనతో భవిష్యత్తులో బాక్సింగ్ రింగ్‌లో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్ మరోసారి తీవ్రంగా స్పందించాడు. 'విజేందర్ నాతో పోటీకి సిద్ధమని చాలెంజ్ చేయడం ఏంటి? అతడికి ఇది చాలా తమాషాగా ఉంది. అసలు విజేందర్కు కెరీర్ లేకుండా చేస్తాను' అని అమీర్ పేర్కొన్నాడు. తనలాంటి స్టార్ ఆటగాళ్లతో పోటీకి రెడీ అని వ్యాఖ్యానించేముందు ఎంతో అనుభవాన్ని సంపాదించాలని విజేందర్కు సూచించాడు. ప్రస్తుతం మిణికట్టు సర్జరీ చేయించుకున్న అమీర్.. విజేందర్ తో పోటీకి తాను సిద్ధమేనని, అయితే ఇంతటి పెద్ద బౌట్లో పాల్గొనాలంటే ఎంతో అనుభవం కావాలని అందుకు కొన్నేళ్ల సమయం పడుతుందన్నాడు. డబ్ల్యూబీఏ లైట్‌వెయిట్ ప్రపంచ చాంపియన్‌గా ఉన్న అమీర్, ఒలింపిక్స్‌లో ఓ రజతం కూడా సాధించాడు. పాకిస్తాన్-భారత్ సంబంధాల తరహాలోనే ఈ బౌట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ క్రేజ్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. వచ్చే 10 బౌట్లు విజేందర్కు సవాల్ విసురుతాయన్నాడు. అతడి ఆటను, బౌట్ కెరీర్ గ్రాఫ్ ను తాను గమనిస్తున్నట్లు వెల్లడించాడు. మా ఇద్దరి మధ్య జరిగే బౌట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడం ఖాయమనీ, అలాకాని పక్షంలో విజేందర్కు తానెప్పుడు మద్ధతిస్తానని పేర్కొన్నాడు. వరుస బౌట్లలో విజయాలతో దూసుకెళ్తోన్న విజేందర్‌ను చిన్నపిల్లాడితో పోల్చుతూ అమీర్ ఇదివరకే ట్వీట్ చేశాడు. విజేందర్ తన కోరిక(అమీర్‌తో బౌట్) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. -
విజేందర్.. ఇప్పటికీ పిల్లాడివే..!
న్యూఢిల్లీ: తనతో భవిష్యత్తులో బాక్సింగ్ రింగ్‌లో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్ స్పందించాడు. వరుస బౌట్లలో విజయాలతో దూసుకెళ్తోన్న విజేందర్‌ను చిన్నపిల్లాడితో పోల్చుతూ ట్వీట్ చేశాడు. విజేందర్ తన కోరిక(అమీర్‌తో బౌట్) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అంటే తనతో పోటీపడితే ఓడిపోవతావని పరోక్షంగా అమీర్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించాడు. తొలిసారి టైటిల్ నెగ్గిన విజేందర్కు శుభాకాంక్షలు తెలిపాడు. అభినందనతో పాటు విజేందర్ కు హెచ్చరికలు పంపాడు. పాక్ సంతతికి చెందిన అమీర్, విజేందర్ వెయిట్ కేటగిరిలు వేర్వేరు కావడంతో ఇప్పట్లో ఇద్దరి మధ్య మ్యాచ్ జరిగే అవకాశం లేదు. డబ్ల్యూబీఏ లైట్‌వెయిట్ ప్రపంచ చాంపియన్‌గా ఉన్న అమీర్, ఒలింపిక్స్‌లో ఓ రజతం కూడా సాధించాడు. గత శనివారం రాత్రి ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ బౌట్లో తాను సాధించిన అద్భుత విజయాన్ని బాక్సింగ్ గ్రేట్ మొహమ్మద్ అలీకి అంకితమిచ్చిన విజేందర్.. అమీర్ తో పోరుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. Congratulations to @boxervijender on the win. Careful what you wish for kid! https://t.co/HUwvjMeQCL — Amir Khan (@amirkingkhan) 18 July 2016
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
కేసులను సత్వరమే పరిష్కరించాలి
రుణమాఫీకి కసరత్తు !
స్కూల్ యూనిఫాం తయారీకి సిద్ధం
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
ప్రమాదాలకు చెక్!
యాదాద్రిలో ఊంజలి సేవ
రేపు జిల్లా స్థాయి చెస్ పోటీలు
సేంద్రియ సాగుతో ప్రయోజనాలు
సిజేరియన్లు తగ్గించకపోతే ఆస్పత్రులు సీజ్
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్‌లో ‘రష్యా’ పరిస్థితులు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
Advertisement