
అలెస్టర్ కుక్ సెంచరీ
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తరువాత ఆడిన తొలి మ్యాచ్ లో అలెస్టర్ కుక్ మెరిశాడు.
టాంటాన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తరువాత ఆడిన తొలి మ్యాచ్ లో అలెస్టర్ కుక్ మెరిశాడు. కౌంటీ మ్యాచ్ ల్లో భాగంగా ఎసెక్స్ తరపున బరిలోకి దిగిన కుక్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సోమర్సెట్ తో ఆదివారం ముగిసిన మ్యాచ్ లో కుక్ శతకం నమోదు చేశాడు. ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్ లో అర్ధ శతకం సాధించిన కుక్.. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు.
సోమర్ సెట్ విసిరిన 255 పరుగుల లక్ష్యాన్ని ఎసెక్స్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుక్ (110;214 బంతుల్లో 16 ఫోర్లు),బ్రౌనీ(39; 113 బంతుల్లో 4 ఫోర్లు), వెస్ట్లీ(86 నాటౌట్;146 బంతుల్లో 15 ఫోర్లు,1సిక్స్) లు జట్టు విజయంలో పాలుపంచుకున్నారు.