అఖరి ఇన్సింగ్స్‌లో కుక్‌ సెంచరీ

Alastair Cook Century In Fifth Test Against India - Sakshi

లండన్‌​ : భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఆటగాడు అలెస్టర్‌ కుక్‌ అద్భుత శతకంతో చెలరేగాడు. చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో కుక్‌ శతకం సాధించి తన కెరీర్‌లో 33వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ సందర్భంగా కుక్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. విహారి వేసిన ఇన్సింగ్స్‌ 70వ ఓవర్‌లో సింగిల్‌ ద్వారా కుక్‌ 100 పరుగుల మార్కును అందుకున్నాడు. అతని సెంచరీ పూర్తి చేయగానే స్టేడియం చప్పట్లతో హోరెత్తింది. 2006లో నాగపూర్‌ టెస్ట్‌ ద్వారా భారత్‌పై తన అరంగ్రేటం మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన కుక్‌.. తన చివరి మ్యాచ్‌లో కూడా భారత్‌పై సెంచరీతో చెలరేగిపోయాడు.

2006లో నాగపూర్‌లో జరిగిన టెస్ట్‌లో కుక్‌ 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 114/2 తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ మొదటి నుంచి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ​కుక్‌-రూట్‌ జోడి క్రీజ్‌లో పాతుకుపోయి ఎడాపెడా బౌండరీలతో చెలరేగిపోయారు. మరో ఆటగాడు రూట్‌ కూడా సెంచరీ దిశగా వెళ్తున్నాడు. లంచ్‌ విరామం సమయానికి ఇంగ్లండ్‌ 243/2తో పటిష్టమైన స్థితిలో నిలిచింది. క్రీజ్‌లో కుక్‌ (103), రూట్‌ (93) ఉన్నారు.  ప్రస్తుతం ఇంగ్లండ్‌ 283 పరుగుల ఆధిక్యంతో ఉంది. 

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top