స్పోర్టింగ్ ఎలెవన్ బౌలర్ అక్తర్ (5/36) విజృంభించడంతో అంబర్‌పేట్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో స్పోర్టింగ్ జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సాక్షి, హైదరాబాద్: స్పోర్టింగ్ ఎలెవన్ బౌలర్ అక్తర్ (5/36) విజృంభించడంతో అంబర్‌పేట్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో స్పోర్టింగ్ జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి రోజు ఆటలో స్పోర్టింగ్ జట్టు 226 పరుగులు చేసింది. రెండో రోజు మంగళవారం 227 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఎస్.ఎ.అంబర్‌పేట్ జట్టు 197 పరుగుల వద్ద ఆలౌటైంది. రహీల్ (62), సైబాజ్ (36) మినహా ఇంకెవరూ రాణించలేకపోయారు. మరో మ్యాచ్‌లో హర్యాంక్ రెడ్డి (67) అర్ధసెంచరీతో రాణించి వీనస్ సైబర్‌టెక్‌ను గెలిపించాడు. ఉస్మానియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట ఉస్మానియా 192 పరుగులు చేసింది. రెండో రోజు లక్ష్యఛేదనకు దిగిన వీనస్ సైబర్‌టెక్ 194 పరుగులు చేసి గెలిచింది. విజయ్ 42, వంశీ 32 పరుగులు చేశారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు: విజయ్ హనుమాన్: 258, హైదరాబాద్ టైటాన్స్: 171 (అఖిల్ 52; షరీఫ్ పఠాన్ 4/32, కార్తికేయ 3/30, జయరామ్ 3/54) నేషనల్ సీసీ: 336/6 (వీరేందర్ నాయక్ 102, మెల్విన్ జాన్ 42), జిందా సీసీ: 226 (హుస్సేన్ 100 నాటౌట్, కలీంఖాన్ 47; విజేందర్ 4/26, ప్రసాద్ 4/35) విశాక: 261/3 (రేవంత్ సాయి 157, మెహర్ ప్రసాద్ 36 నాటౌట్, సిద్దిఖీ అహ్మద్ 32), ఎస్‌బీఐ: 96 (రేవంత్ సాయి 6/15) టీమ్ స్పీడ్: 165 (అఫ్జల్ బియబాని 3/25), గుజరాతీ ఎలెవన్: 134 (జంషేద్ 36 నాటౌట్; సాయి వెంకటేశ్ 5/63).