పాక్ ప్రాబబుల్స్‌లో అజ్మల్ | Ajmal, Malik in Pakistan's preliminary WC squad | Sakshi
Sakshi News home page

పాక్ ప్రాబబుల్స్‌లో అజ్మల్

Dec 7 2014 12:55 AM | Updated on Sep 2 2017 5:44 PM

సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను వన్డే ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో ఎంపిక చేశారు.

కరాచీ: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను వన్డే ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో ఎంపిక చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మార్చి 31 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగే ప్రపంచ కప్ కోసం 30 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శనివారం ప్రకటించింది.
 
  తుది జట్టును ఖరారు చేసేందుకు మరో నెల రోజుల గడువు ఉన్నందుకే అజ్మల్‌ను ఎంపిక చేశామని పీసీబీ అధికారి వివరణ ఇచ్చారు. తన బౌలింగ్ శైలిని సరిదిద్దుకునే పనిలో ఉన్న అజ్మల్ త్వరలో ఐసీసీ నిర్వహించే పరీక్షకు హాజరుకానున్నాడు. అజ్మల్‌తోపాటు ప్రాబబుల్స్‌లో వెటరన్స్ కమ్రాన్ అక్మల్, షోయబ్ మాలిక్‌లకు చోటు దక్కింది.
 

Advertisement
 
Advertisement
Advertisement