
‘అర్జున’ను అందుకున్న రోహిత్, రహానే
భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే అర్జున పురస్కారాలను అందుకున్నారు.
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే అర్జున పురస్కారాలను అందుకున్నారు. స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి విజయ్ గోయల్ వారికి ఈ క్రీడా పురస్కారాలను అందించారు. అవార్డు కింద చెరో రూ.5 లక్షల నగదుతో పాటు ప్రతిమను అందించారు. జాతీయ క్రీడా దినోత్సవం రోజున రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొనలేదు. భారత్‌లో క్రికెట్‌కు అమిత ఆదరణ ఉన్నా, ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మిగతా ఆటలకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తోందని మంత్రి గోయల్ తెలిపారు.