జపాన్ ఓపెన్‌పై సైనా గురి | Aim Saina on Japan Open | Sakshi
Sakshi News home page

జపాన్ ఓపెన్‌పై సైనా గురి

Sep 8 2015 12:47 AM | Updated on Sep 3 2017 8:56 AM

జపాన్ ఓపెన్‌పై సైనా గురి

జపాన్ ఓపెన్‌పై సైనా గురి

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి మంచి ఊపు మీదున్న నంబర్‌వన్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇక జపాన్ సూపర్ సిరీస్‌పై గురి పెట్టింది...

రెండో రౌండ్‌లో సింధుతో పోటీ!
టోక్యో:
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి మంచి ఊపు మీదున్న నంబర్‌వన్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇక జపాన్ సూపర్ సిరీస్‌పై గురి పెట్టింది. నేటి (మంగళవారం) నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. రెండో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సైనా బుధవారం తన తొలి మ్యాచ్‌లో బుసానన్ ఒంగ్‌బుమ్‌రంగ్‌పన్ (థాయ్‌లాండ్)ను ఎదుర్కొంటుంది. ఇందులో నెగ్గితే రెండో రౌండ్‌లో తెలుగు తేజం పీవీ సింధును ఢీకొనే అవకాశం ఉంది. గతేడాది ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్ ఫైనల్లో తలపడిన తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యర్థులుగా ఆడలేదు. పురుషుల విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కె.శ్రీకాంత్ ఒక్కడికే సీడింగ్ దక్కింది. తను స్కాట్ ఇవా న్స్ (ఐర్లాండ్)తో తొలిరౌండ్ ఆడతాడు. పి.కశ్యప్, ప్రణయ్, సాయి ప్రణీత్ కూడా ఆడనున్నారు. మహిళల డబుల్స్‌లో భారత్ నుంచి గుత్తా జ్వాల-అశ్విని.. ప్రద్య్నా గాద్రె-సిక్కిరెడ్డి జంటలు తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement