క్వార్టర్స్‌లో హారిక | After Humpy, Harika too in world championship pre-quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో హారిక

Mar 26 2015 12:57 AM | Updated on Sep 2 2017 11:22 PM

క్వార్టర్స్‌లో హారిక

క్వార్టర్స్‌లో హారిక

ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హారిక ‘టైబ్రేక్’లో 1.5.-0.5తో విజయం సాధించింది. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత వీరిద్దరూ 1-1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి బుధవారం టైబ్రేక్‌ను నిర్వహించారు.

టైబ్రేక్ తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 55 ఎత్తుల్లో కొస్టెనిక్‌ను ఓడించగా... నల్లపావులతో ఆడిన రెండో గేమ్‌ను 91 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో కోనేరు హంపి; మేరీ అరాబిద్జె (జార్జియా)తో హారిక తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement