పవన్ పార్టీలోకి స్టార్ ప్లేయర్? | Ace Badminton Player To Join Pawan Kalyan Party? | Sakshi
Sakshi News home page

పవన్ పార్టీలోకి స్టార్ ప్లేయర్?

Feb 27 2017 5:43 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ పార్టీలోకి స్టార్ ప్లేయర్? - Sakshi

పవన్ పార్టీలోకి స్టార్ ప్లేయర్?

భవిష్యత్తులో రాజకీయాల్లో చేరతానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సూచనప్రాయంగా వెల్లడించింది.

హైదరాబాద్: భవిష్యత్తులో రాజకీయాల్లో చేరతానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సూచనప్రాయంగా వెల్లడించింది. రాజకీయాల్లో చేరాలన్న ఆసక్తి ఉన్నట్టు ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్వాల చెప్పింది. ఏ పార్టీలో చేరినా స్టార్ క్యాంపెయినర్ కావాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. 'రాజకీయాల్లోకి వస్తే క్రియాశీలకంగా పనిచేస్తా. నాకు అప్పగించిన పదవికి న్యాయం చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. నేను స్టార్ క్యాంపెయినర్ కావాలనుకోవడం లేద'ని జ్వాల పేర్కొంది.

సినీ నటుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ అడగ్గా... ఆమె సానుకూలంగా స్పందించారు. 'ప్రజా సమస్యలు, అభివృద్ధిపై పవన్ గళం విన్పిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నార'ని జ్వాల అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆమె.. జనసేన పార్టీలో చేరతారని ప్రచారం మొదలైంది. నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం ఉన్న గుత్తా జ్వాల రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ ఏ పార్టీలో చేరతారో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement