ఐపీఎల్‌కు అందాల ఆరంభం | Tamannaah Dance Show On IPL Stage | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు అందాల ఆరంభం

Apr 5 2018 8:20 AM | Updated on Apr 5 2018 8:20 AM

Tamannaah Dance Show On IPL Stage - Sakshi

తమిళసినిమా: ఐపీఎల్‌ సందడికి టైమ్‌ వచ్చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా క్రికెట్‌ ఫీవర్‌ మొదలు కానుంది. 51 రోజులు ఐపీఎల్‌ క్రికెట్‌ క్రీడాభిమానుల్ని ఎంటర్‌టెయిన్‌ చేయనుంది. ఈ క్రీడా వేదిక ఆరంబమే అదుర్స్‌ అనేలా నిర్వాహకులు ప్లాన్‌ చేశారు. శనివారం ముంబైలో ఈ క్రీడా పోటీల ప్రారంభ వేడుకలో మీల్కీబ్యూటీ తమన్నా ఆకర్షణ కానున్నారు. అవును ఈ బ్యూటీ తన ఆటా పాటతో క్రీడా ప్రియుల్ని మైమరపించనున్నారు.

ఇప్పటి వరకూ సిల్వర్‌ స్క్రీన్‌పై ఆడి పాడి అందాలు కుమ్మరించిన తమన్నా ఇప్పుడు బహిరంగ వేదికపై స్టెప్స్‌ వేయడానికి సిద్ధం అవుతున్నారు. అందుకు ఈ అమ్మడు భారీ మొత్తంలోనే పారితోషికాన్ని అందుకుందని సమాచారం. సాధారణంగా ఈ ప్రారంభోత్సవ వేడుకకు పోటీల్లో పాల్గొనే అన్ని జట్ల కెప్టెన్లకు ఆహ్వానం ఉంటుంది. అలాంటిది ఈ సారి ముంబై, చెన్నై జట్టు కెప్టెన్లకే ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. ఇది క్రికెట్‌ బోర్డు నిర్వాహకులకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తీసుకున్న నిర్ణయం అట. ఈ వేదికపై నటి తమన్నాతో పాటు మరికొందరు బాలీవుడ్‌ బ్యూటీస్‌ ఆకర్షణగా నిలవనున్నారు. వారి అందాలతో చిందేసి ఆహూతులకు కనువిందు చేయనున్నారు. ఐపీఎల్‌ వేడుకలో మీల్కీబ్యూటీ సందడి చేయనుండడం ఇదే మొదటిసారి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement