మీరు రావొద్దు నేనే వస్తా | raghava lawrence photo session with fans | Sakshi
Sakshi News home page

మీరు రావొద్దు నేనే వస్తా

Feb 5 2018 9:24 AM | Updated on Feb 5 2018 9:24 AM

raghava lawrence photo session with fans - Sakshi

లారెన్స్‌

తమిళసినిమా: సామాజిక సేవలందించడంలో ముందుండే వారిలో  నటుడు లారెన్స్‌ ఒకరని చెప్పవచ్చు. పలువురు అనాథలకు ఆశ్రయం ఇచ్చి వారి సంక్షేమం కోసం పాటు పడుతున్న ఈయన, పలువురు చిన్నారులకు శస్త చికిత్స చేయించి మరు జన్మనిస్తున్నారు. లారెన్స్‌కు అభిమానులు అధికమనే చెప్పాలి. వారిలో చాలా మంది లారెన్స్‌ను కలిసి ఆయనతో ఫొటోలు దిగాలని కోరుకుంటారు. అలా కడలూరుకు చెందిన ఆర్‌.శేఖర్‌ అనే యువకుడు ఇటీవల లారెన్స్‌ను కలిసి ఆయనతో ఫొటో దిగాలని చెన్నైకి వస్తూ మార్గమధ్యలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.

ఈ సంఘటన లారెన్స్‌ను ఎంతగానో కలచివేసిందట.ఆ అభిమాని అంతక్రియలకు హాజరైన లారెన్స్‌ శేఖర్‌ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సంఘటనతో లారెన్స్‌ ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారట. దీని గురించి ఆయన తెలుపుతూ ఇకపై తన అభిమానులెవ్వరూ ఫొటోల కోసం అంటూ తన వద్దకు రావద్దని, సమయం దొరికినప్పుడల్లా తానే మీ వద్దకు వచ్చి ఫొటోల కార్యక్రమంలో పాల్గొంటానని వెల్లడించారు. కాగా ఈ నేపథ్యంలో ఈ నెల 7నన లారెన్స్‌ సేలం వెళ్లి అక్కడ అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement