‘మాన్సీ’ లేవరా.. పాఠం విను!! | Kid Sleeping In Classroom Cute Video Goes Viral | Sakshi
Sakshi News home page

Sep 4 2018 5:15 PM | Updated on Sep 4 2018 6:44 PM

Kid Sleeping In Classroom Cute Video Goes Viral - Sakshi

ఆకలి రుచెరగదు.. నిద్ర సుఖమెరగదు.. ఈ సామెత మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది కదా. మాన్సీ అనే చిన్నారి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. టీచర్‌ చెప్పే పాఠం బోర్‌ కొట్టిందో ఏమో.. క్లాస్‌రూంలోనే హాయిగా కునుకు తీసింది. ఇది గమనించిన మాన్సీ బెంచ్‌మేట్‌.. ఆమెను నిద్ర లేపేందుకు ఎంతగానో ప్రయత్నించింది. కానీ మాన్సీ మాత్రం తనకేమీ పట్టనట్టు నిద్రలోకి జారుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. చిన్నారి మాన్సీ నిద్రపోవడం.. ఆమె పడిపోకుండా పక్కనే స్నేహితురాలు పట్టుకోవడం... ఆ సమయంలో ఆ ఇద్దరు చిన్నారుల హావభావాలు క్యూట్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement