
విలేకరులతో మాట్లాడుతున్న జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని
ఒంగోలు సెంట్రల్: బాల్య వివాహాలు వద్దు..ఆడ పిల్లలకు చదువే ముద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్శన్ ఎంజీ ప్రియదర్శిని అన్నారు. బుధవారం స్థానిక జిల్లా జడ్జి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చైల్డ్‌లైన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థలు దాదాపు 200 బాల్య వివాహాలు నిలుపుదల చేసినట్లు తెలిపారు. వీరిలో పదో తరగతి ఫలితాల్లో ఐదుగురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, ప్రజల్లో అవగాహన కోసం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్ర కనిగిరిలో ప్రారంభమై వెలిగండ్ల వరకూ సాగిందని జిల్లా జడ్జి ప్రియదర్శిని వివరించారు. పారాలీగల్ వలంటీర్ బీవీ సాగర్ పాల్గొన్నారు.