రచ్చబండ, పల్లెనిద్రతోప్రజల మధ్యకు.. | ysrcp rachabanda and palle nidra from today onwords | Sakshi
Sakshi News home page

రచ్చబండ, పల్లెనిద్రతోప్రజల మధ్యకు..

Nov 11 2017 11:39 AM | Updated on May 29 2018 4:37 PM

ysrcp rachabanda and palle nidra from today onwords - Sakshi

ఒంగోలు అర్బన్‌: వైఎస్సార్‌ సీపీ అన్నీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటామని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శని, ఆదివారాల్లో జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పగలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుంటామన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో పల్లెనిద్ర చేసి ఆయా కాలనీల ప్రజల ఇక్కట్లను గుర్తించి

రచ్చబండ, పల్లెనిద్రతో ప్రజల మధ్యకు..
భరోసా కల్పిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి, ప్రజలకు వచ్చే లాభాలను ప్రజలకు వివరిస్తామన్నారు. హోదాతో రాయితీలు వస్తాయని, తద్వారా పరిశ్రమలు భారీగా రాష్ట్రంలో నెలకొల్పవచ్చన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు.

నేడు బాలినేని ఒంగోలు రాక: వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు చేరుకుంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు మండలంలోని అల్లూరు గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. సాయంత్రం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement