‘పవన్‌ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం సిగ్గుచేటు’ | YSRCP MLA Grandhi Srinivas Slams On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘పవన్‌ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం సిగ్గుచేటు’

Jan 28 2020 4:55 PM | Updated on Jan 28 2020 6:33 PM

YSRCP MLA Grandhi Srinivas Slams On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును చూస్తుంటే ‘మనిషికో మాట-గొడ్డుకో దెబ్బ’ అనే సామెత గుర్తుకు వస్తుందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబును ప్రజలు 23 స్థానాలకే పరిమితం చేశారని విమర్శించారు. తన కొడుకునే గెలిపించుకోలేకపోయిన చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుడుతున్నారని ఈ సందర్భంగా గ్రంధి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement