‘అప్పటి నుంచి మైండ్‌ మరింత దెబ్బతిన్నట్టుంది’

YSRCP Leader Vijaya Sai Reddy Critics Chandrababu Over Illegal Constructions - Sakshi

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

సాక్షి, అమరావతి : టీడీపీ అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి 23 సీట్లిచ్చి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో అడ్డగోలుగా మాట్లాడుతున్న టీడీపీ సభ్యుల తీరుపై శాసనసభ స్పీకర్‌ పలుమార్లుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లు కట్టబెట్టిన ప్రతిపక్షపాత్ర పోషించకుండా చంద్రబాబు వింతగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శలు చేశారు. ‘అధికారం పోయిన తర్వాత మైండ్ మరింత దెబ్బతిన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం కృష్ణా నది భవానీ ద్వీపం నుంచే మొదలవుతుందట. ప్రకాశం బ్యారేజి కట్టక ముందు లింగమనేని గెస్ట్ హౌజ్ ప్రాంతం నది వెలుపలే ఉండేదట. ఇదేం వాదన బాబూ?’అని చురకలంటించారు.

మరొక ట్వీట్‌లో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారుల తీరుపై విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓడినా చంద్రబాబే సీఎం అని ఆ మధ్య మాజీ మంత్రి ఒకావిడ..  రాజపత్రంలో ప్రకటించినంత ధీమాగా చెప్పుకొచ్చారు. దీనిని గట్టిగా నమ్మినట్టున్నారు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలోని కొందరు అధికారులు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫొటో  పెట్టడానికి ఇష్టపడటం లేదట. పచ్చ జీవులూ డినయలిజం నుంచి బయటపడండి. వాస్తవ ప్రపంచంలోకి రండి’అని హితవు పలికారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top