మోదీ పేరు ఎత్తడానికి బాబుకు భయం! | ysrcp leader parthasarathy slams chandrababu | Sakshi
Sakshi News home page

Feb 17 2018 4:02 PM | Updated on Aug 14 2018 11:26 AM

ysrcp leader parthasarathy slams chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: కేంద్ర బడ్జెట్‌ వచ్చిన 17 రోజుల తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి మాట్లాడారని, కానీ ఆయన తన ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీ పేరు ఎత్తడానికే భయపడ్డారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పార్థసారథి విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి పోరాటం చేయలేదని, ఇప్పుడు ఎవరిపై పోరాటం చేస్తారో ఆయన స్పష్టం చేయాలని నిలదీశారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటంలో చంద్రబాబు విఫలమై.. ఆ నెపాన్ని ఇతరులపై నెట్టేయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఏపీ ఎంపీలందరూ రాజీనామా చేసి.. ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దామని పార్థసారథి సూచించారు.

కేండ్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన దాదాపు 17 రోజుల తర్వాత చంద్రబాబు తాజాగా స్పందించిన సంగతి తెలిసిందే. ఏపీకి నిధులు కావాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నానని చెప్తూనే.. రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు కేంద్రంపై ఏవిధంగా ఒత్తిడి తెస్తారో ఆయన ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement