‘సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి’

YSRCP Leader Merugu Nagarjuna Slams To CM Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై  వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. అంతేకాక చంద్రబాబు దళిత వ్యతిరేకి అని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. శనివారం ఆయన విజయవాడ వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయలంలో  మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయి అని డిమాండ్‌ చేశారు. దళిత తేజం పేరుతో నెల్లూరులో జరిగే మీటింగ్‌కు జనాన్ని తరలిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అని నిలధీశారు. దళితుల పరిస్థితి ఒక్క శాతం కూడా మెరుగుపడలేదని మేరుగ ఆరోపించారు. 

‘రాష్ట్రంలో రాజ్యాంగం అవహాస్యం అవుతుంది. దళితులపై దాడులు జరుగుతుంటే మీ నోరు ఎందుకు మూడపడింది చంద్రబాబు? దళితులకు  రాజ్యాంగబద్ధంగా కేటాయించాల్సిన నిధులు ఏమయ్యాయి? రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ కన్న కలలు ఇవేనా?  దళితులు చదువుకోకూడదని ఎస్సీ హాస్టల్స్‌ మూయించింది వాస్తవం కాదా. చంద్రబాబు నీది దళిత వ్యతిరేక స్వాభావం. దళిత ద్రోహి చంద్రబాబు.. అంబేడ్కర్‌ మహానుబావుడు. నువ్వు 420వి.. నీకు ఆయనకి పోలికా? విరగిపోయే చెట్టు చంద్రబాబు.. అయితే మొలకెత్తే విత్తనం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని’ మేరుగ అన్నారు.

నాలుగేళ్లలో చంద్రబాబు ఏం ఉద్ధరించారని మండిపడ్డారు. దళితులకు సెంట్‌ భూమి ఐనా ఇచ్చావా చంద్రబాబు ? దళిత తేజం ఇదేనా అని నిలదీశారు. దళితుల భూములను సైతం చంద్రబాబు కొల్లగొట్టారని ఆయన మండిపడ్డారు. దళితులపై జరిగిన దాడుల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగోస్థానంలో ఉందని జాతీయ క్రైమ్‌ రికార్డుల చెబుతున్నాయని మేరుగ పేర్కొన్నారు.  ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు దోచుకుంటున్న జుపూడిపై చర్యలేవి అని వైఎస్సార్‌సీపీ నేత మేరుగ నాగార్జున చంద్రబాబును ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top