అందమైన కల..ఆవిరైన వేళ..

YSR Kadapa Tankbund Project Development  Activities Are Stopped - Sakshi

కడపలో ట్యాంక్‌బండ్‌?
కడప నగరం పాతకడప చెరువు ప్రాంతాన్ని ట్యాంక్‌బండ్‌లాగా తీర్చిదిద్దాలని కొందరు విజ్ఞులు డాక్టర్‌ వైఎస్సార్‌కు సూచించారు. ఆయన ముఖ్యమంత్రిగా ‘రైట్‌’ అన్నారు. నగర ప్రాంతం గనుక నగర పాలక సంస్థ ఆ«ధ్వర్యంలో చెరువును సుందరీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేయమన్నారు. ఆ తర్వా త ఆయన లేరు. దాని గురించి పట్టించుకున్న వారు కూడా లేరు. కడప కార్పొరేషన్‌లో కొందరు వైఎస్సార్‌ అభిమానులు, ఆ తర్వాత ఆ చెరువు సుందరీకరణ విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన కలను నిజం చేసేందుకు కృషి ప్రారంభించారు. ప్రభుత్వ పరంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. చెరువు రోడ్డువైపు సగం మేర చుట్టూ రోడ్డు వేసేందుకు చదును చేశారు.

సిమెంటు  చేసి ప్లాట్‌ఫాంగా మార్చి పూలమొక్కలు, ఆకర్శణీయమైన బొమ్మలు ట్యాంక్‌బండ్‌ తరహాలో జిల్లాకు చెందిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా రోడ్డుపై కొన్నిచోట్ల సిమెంటు బెంచీలను కూడా ఏర్పాటు చేశారు. చెరువులోకి చెత్త కొట్టుకు రాకుండా చుట్టూ ఆరు అడుగుల ఎత్తున ఇనుపజాలి వేశారు. అన్నీ పూర్తయ్యాక ఇప్పటికే ఉన్న బోటిం గ్‌ను భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలని భావించారు. కానీ   వైఎస్సార్‌కు పేరొస్తుందన్న కారణంగా ఇప్పటికీ చెరువు అభివృద్ధికి కొందరు వ్యక్తులు అడ్డు తగులుతున్నారు. ఫలితంగా చెరువు అభివృద్ధి ఆగిపోయింది. నగర వాసుల కల చెదిరింది.

ఆడిటోరియందీ అదే దారి
కడపకు కలల జిల్లాగా పేరుంది. నగరంలో మొన్నటివరకు కళా ప్రదర్శనలు తరు చూ జరిగేవి. మున్సిపల్‌ షాదీఖానా పక్కన ప్రత్యేకంగా ఉండిన రంగస్థలంలో కార్యక్రమాలు నిర్వహించేవారు. కాలక్రమంలో అది కూలిపోగా దాని స్థానంలో డాక్టర్‌ వైఎ స్‌ మ్యుమంత్రిగా ఉన్నప్పుడు కొత్త ఆడిటోరియం నిర్మింపజేశారు. నిత్యం కళా ప్రదర్శనతో కళకళలాడాలని, నగర వాసులకు ఆహ్లాదం అందించాలన్నది ఆయన ధ్యేయం. కానీ ఆయనతోనే ఆ ఆశలు ఆవిరయ్యాయి.

కళా ప్రదర్శనలకు నెలవుగా ఉంటుందని భావించిన ఆ రంగస్థలం నేడు మున్సిపల్‌ షాదీమహల్‌ పక్కనే మరో కల్యాణ మండపంగా మారింది. కనీసం వివాహాలకు కూడా ఆ వేదిక పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు. దీంతో ఈ ఆడిటోరియం ఉండీ లేనట్లుండి ఉని కిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. మళ్లీ ఆయన లాంటి పాలన వస్తేగానీ వీటి ఉద్దేశాలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. 

ఆయన దార్శనికుడు
జిల్లా సర్వతోముఖాభివృద్ధిని కాం క్షించి  ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసిన జిల్లా ముద్దుబిడ్డ డాక్టర్‌ వైఎస్సార్‌. కన్నతల్లి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయడంలో కడప నగరాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. మరో విడత ఉండి ఉంటే ఈ నగరం దేశానికే ఆదర్శంగా నిలిచేది.


– ఖాజా రహమతుల్లా, కడప

రుణం తీర్చుకున్నారు 
కడప తల్లి బిడ్డగా డాక్టర్‌ వైఎస్సార్‌ జిల్లా రుణాన్ని తీర్చుకున్నారు. కడపను అందంగా తీర్చిదిద్దడానికి ఎం తో కృషి చేశారు. ఆయన కృషి అనితర సాధ్యం. మరిన్ని రోజులు గనుక ఉండిఉంటే జిల్లాను ఊహించనంతగా తీర్చేవారు. ముఖ్యంగా నగరం కళకళలాడేది. 

   – నాగేంద్రారెడ్డి, కడప 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top