‘అందువల్లే చంద్రబాబు బీసీలపై ప్రేమ చూపిస్తున్నారు’ | YSR Congress Party Protest For BCs Welfare In Nellore | Sakshi
Sakshi News home page

‘అందువల్లే చంద్రబాబు బీసీలపై ప్రేమ చూపిస్తున్నారు’

Dec 24 2018 12:31 PM | Updated on Dec 24 2018 12:49 PM

YSR Congress Party Protest For BCs Welfare In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : ఎన్నికలు దగ్గరకు వస్తున్నందునే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలపై ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. సోమవారం బీసీల పట్ల టీడీపీ ప్రభుత్వ అణిచివేత వైఖరికి నిరసనగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో బీసీల ర్యాలీ, కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌, భాస్కర్‌ గౌడ్‌, రూప్‌కుమార్‌ యాదవ్‌, కాకాణి గోవర్థన్‌ రెడ్డి, నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ.. బీసీలకు సబ్‌ప్లాన్‌ అని చెప్పి బాబు మోసం చేశారని ఆరోపించారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పిన చంద్రబాబు లాంటి నేత ఎవరూ లేరన్నారు.   

నాయీ బ్రాహ్మణులను బాబు కించపరిచారు: కాకాణి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయీ బ్రాహ్మణులను కించపరిచారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కాకాణి గోవర్థన్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఇచ్చిన హమీ మేరకు జీతాలు ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement