నూజివీడు నియోజకవర్గంలోకి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర | YS Jagan Padayatra To Enter Nuzvid Constituency | Sakshi
Sakshi News home page

నూజివీడు నియోజకవర్గంలోకి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

Apr 18 2018 6:30 PM | Updated on Aug 8 2018 5:54 PM

YS Jagan Padayatra To Enter Nuzvid Constituency - Sakshi

కృష్ణా జిల్లా పాదయాత్రలో వైఎస్‌ జగన్‌

సాక్షి, నూజివీడు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం మైలవరం నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకుని నూజివీడు నియోజవర్గంలోకి వైఎస్‌ జగన్‌ అడుగుపెట్టారు. శోభనాపురం అడ్డరోడ్డు వద్ద నూజివీడు నియోజకవర్గంలోకి జననేత ప్రవేశించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు ఘనస్వాగతం పలికారు. రాజన్నబిడ్డను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

కృష్ణా జిల్లా గణపవరం వద్ద బుధవారం పాదయాత్ర 1800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీలు వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు ర్యాలీగా బయలుదేరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement