రాజన్న రాజ్యం జగన్‌కే సాధ్యం: విజయనిర్మల

YS Jagan Is Only Possible To Make Rajanna Rule In Andhra Pradesh - Sakshi

మనసులో మాట

సాక్షి, విశాఖ సిటీ :  ‘మహానేత వైఎస్సార్‌ని రెండుసార్లు మాత్రమే కలిశాను. ఆయనకు ప్రతిపక్షం, అధికార పక్షమనే తేడా లేదు. సీఎంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలనూ సమానంగా చూశారు. చంద్రబాబుది మాత్రం దానికి పూర్తి వ్యతిరేకమైన మనస్తత్వం. అందుకే రాజన్న రాజ్యం తర్వాత ఇప్పుడు రావణరాజ్యంలా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికి జగన్‌ ఓ భరోసా. పెద్దాయనలాంటి పాలన అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. తమకు నిజమైన సోదరుడు వైఎస్‌ జగన్‌ అని ప్రతి మహిళలోనూ బలంగా నాటుకుపోయింది’ అని విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల అన్నారు. ఆమె ‘సాక్షి’తో పంచుకున్న అంతరంగం ఆమె మాటల్లోనే.. 

అనుకోకుండా అవకాశం.. 
నా భర్త వెంకటరమణ రాజకీయ నాయకుడిగా భీమిలి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2005లో కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్న సమయంలో మా స్థానం మహిళకు కేటాయించడంతో అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది. అప్పటికే సామాజిక సేవలో ప్రజలకు సుపరిచితురాలినై ఉండటంతో గెలుపు అవకాశం తలుపు తట్టింది. రాజకీయాల్లోకి వస్తే.. ప్రజాసేవ చేసేందుకు మరింత అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఆ బాటలో ప్రయాణించాను.  

వైఎస్సార్‌ వ్యక్తిత్వానికి ముగ్ధురాలినయ్యాను.. 
2008 డిసెంబర్‌లో రాష్ట్రంలో ఉన్న మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లతో సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్పుడే పెద్దాయనను తొలిసారి చూశాను. ముఖ్యమంత్రి అంటే.. గంభీరంగా ఉంటారు, కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులతోనే మాట్లాడతారన్న ఆలోచన ఉండేది. కానీ.. ఆయన్ని చూడగానే నా ఆలోచన తప్పు అని అర్థమైంది. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి చిరునవ్వుతో పలకరించారు. అందరితో సరదాగా మాట్లాడి సమస్యలన్నీ సానుకూలంగా విన్నారు. భీమిలి సమస్యల గురించి చెప్పగానే టీడీపీ అని తెలిసి కూడా.. రాజన్న స్పందించిన తీరు చూసి ఆయన వ్యక్తిత్వానికి ముగ్ధురాలినయ్యాను. మున్సిపాలిటీ బిల్డింగ్‌ కోసం రూ.50 లక్షలు, మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.17 కోట్లు, మురికివాడల అభివృద్ధికి రూ.3.35 కోట్లు.. ఇలా చెప్పిన సమస్యలన్నింటికీ నిధులు మంజూరు చేశారు.  

రాజన్నకి.. చంద్రబాబుకి తేడా అదే.. 
నేను టీడీపీకి చెందిన చైర్‌పర్సన్‌నని వైఎస్సార్‌తో అన్నాను. ఆయన చిరునవ్వు నవ్వి.. నువ్వు ఏ పార్టీ అయితే ఏంటమ్మా.. మా రాష్ట్రంలోనే ఉన్నావుగా.. నీ మున్సిపాలిటీ అభివృద్ధి చెందితే.. ఏపీలో ఒక ప్రాంతం అభివృద్ధి చెందినట్టే కదా.. అని నవ్వుతూ బదులిచ్చారు. ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే చెప్పండన్నారు. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక ముఖ్యమంత్రి అంతటి విజన్‌తో ఆలోచిస్తారా! అని అనుకున్నాను. చంద్రబాబుకీ, వైఎస్సార్‌కు ఉన్న తేడా అదే. రాజన్న రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడతారు. చంద్రబాబు మాత్రం తన ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న ప్రాంతాలకే నిధులు ఇస్తారు. ప్రతిపక్ష పార్టీ అంటే చాలు రూపాయి కూడా ఇవ్వకుండా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందనీయరు. ఇటీవలే ఓ వేదికపై ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే అంగీకరించారు కదా.. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడితో.. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది.?  

మళ్లీ జగన్‌లో చూశాను.. 
పెద్దాయన మరణించాక.. నాకు చాలా బాధనిపించింది. 2011లో ఆయన తనయుడు జగన్‌మోహనరెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు 2012లో విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాను. చిన్నవాళ్లకు మర్యాద ఇచ్చే నైజం జగన్‌లో చూసినప్పుడు రాజన్నే గుర్తొచ్చారు. బహుశా.. జగనన్న వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి చూసిన వారెవరూ ఆయన్ని విడిచి వెళ్లే ఆలోచన చేయరు.  

నడిచొస్తున్న నమ్మకాన్ని చూశా.. 
విశాఖలో ప్రజాసంకల్ప యాత్ర అడుగుపెట్టినప్పటి నుంచి పాదయాత్రలో పాల్గొన్నాను. అన్ని జిల్లాల్లోనూ జరిగిన పాదయాత్రను ప్రసార మాధ్యమాల్లో చూశాను. నడిచొస్తున్న నమ్మకంలా ప్రజలకు జగన్‌ కనిపించారు. ఆయనొస్తేనే మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం ప్రజలందరిలో నాటుకుపోయింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. 
రాజన్న బిడ్డను గెలిపించుకుందామా అన్నట్టు ఎదురుచూస్తున్నారు. 

వెలగపూడి ఇక విజయవాడకే... 
పదేళ్ల పాటు తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు ప్రజలకు ఏం చేయలేదు. కేవలం ఆయన మద్యం వ్యాపారాన్ని, నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారే తప్ప.. ప్రజల బాగోగుల గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. గుర్రపు పందేలు, జూదాలు.. ఇలా ప్రజల సొమ్ముల్ని దోచుకుతినే ఎమ్మెల్యేగా చరిత్రపుటల్లో నిలిచిపోతారు. విశాఖ వంటి మహా నగరంలో తూర్పు నియోజకవర్గంలోని 3 వార్డుల్లో ఒక్క బస్టాప్‌ కూడా లేదంటే ఆయన పనితీరు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా.. ఇప్పుడు మళ్లీ బెదిరింపు ధోరణులతో ఓటు వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత.. ఎక్కడి నుంచైతే వెలగపూడికి వచ్చారో.. అక్కడికి రిటర్న్‌ వెళ్లిపోవాల్సిందే. 

అతివలకు అసలైన సోదరుడు
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళా అధికారులపై ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు దాష్టికానికి పాల్పడిన ఘటనలు ఎన్నో చూశాం. ఎన్నికలు రాగానే మహిళలపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తూ.. పసుపు కుంకుమ అంటూ చంద్రబాబు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ.. మహిళలెవ్వరూ ఆయనను నమ్మే పరిస్థితి లేదు. అన్ని వర్గాల మహిళలకూ అండగా నిలబడేందుకు జగన్‌ వచ్చారు. ఆయన్ని చూస్తే.. మా అందరికీ అసలైన సోదరుడిగా అండగా ఉంటారన్న నమ్మకం కలిగింది. ఏ పార్టీ ఇవ్వనన్ని సీట్లు మహిళలకు కేటాయించారంటే.. మహిళా సాధికారత జగన్‌ వల్లే సాధ్యమవుతుందని స్పష్టమవుతోంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-07-2019
Jul 04, 2019, 14:21 IST
చెన్నై : వేలూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ ప్రకటించింది....
09-06-2019
Jun 09, 2019, 05:00 IST
పట్నా: ఒక కుటుంబం నుంచి ఒకరు ఎంపీ కావడమే గొప్ప. అలాంటిది ఏకంగా నలుగురు ఒకేసారి పార్లమెంట్‌కు ఎన్నిక కావడమంటే...
09-06-2019
Jun 09, 2019, 04:52 IST
దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే...
08-06-2019
Jun 08, 2019, 08:12 IST
సాక్షి, అమరావతి: ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సొంత పార్టీ నేతల వద్ద అభిప్రాయపడ్డారు....
08-06-2019
Jun 08, 2019, 04:07 IST
న్యూఢిల్లీ: సాధారణంగా ప్రధానమంత్రి తర్వాత ప్రమాణం స్వీకారం చేసే వ్యక్తినే ప్రభుత్వంలో నంబర్‌ 2గా భావిస్తారు. అలా చూస్తే మోదీ...
06-06-2019
Jun 06, 2019, 19:56 IST
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటు వేసిన వారికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలిపింది....
06-06-2019
Jun 06, 2019, 19:54 IST
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి ఓడిపోతారని, సంపన్నులను మాత్రమే ఆయన పట్టించుకుంటున్నారు..కానీ...
06-06-2019
Jun 06, 2019, 16:53 IST
చండీగఢ్‌ : మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశానికి డుమ్మా...
06-06-2019
Jun 06, 2019, 15:31 IST
ఆంధ్రా కాంట్రాక్టర్ల సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొంటున్నారని ఉత్తమ్‌ విమర్శించారు.
06-06-2019
Jun 06, 2019, 14:02 IST
మహా భారతంలో కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ నాయకత్వంలోని ఘట్‌బంధన్‌ విఫలమై విడిపోవడానికి...
06-06-2019
Jun 06, 2019, 10:41 IST
స్థానిక నాయకుల వల్లే కుప్పంలో తగ్గిన మెజారిటీ
06-06-2019
Jun 06, 2019, 08:25 IST
 చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచిన ముగ్గురు ఎంపీలు పదవుల కోసం రచ్చకెక్కడంతో తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. ...
05-06-2019
Jun 05, 2019, 17:31 IST
తెలుగు దేశం పార్టీలో లోక్‌సభ పదవుల పందేరం చిచ్చు రేపింది.
05-06-2019
Jun 05, 2019, 15:34 IST
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి ఘోరంగా విఫలమవ్వడంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గుడ్‌బై చెప్పిన...
05-06-2019
Jun 05, 2019, 13:14 IST
రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..
05-06-2019
Jun 05, 2019, 11:45 IST
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. తమ పార్టీతో పెట్టుకుంటే...
05-06-2019
Jun 05, 2019, 09:03 IST
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్‌ ఇచ్చారు. పార్లమెంటరీ విప్‌ పదవిని ఆయన తిరస్కరిస్తూ...
05-06-2019
Jun 05, 2019, 08:29 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ...
05-06-2019
Jun 05, 2019, 07:52 IST
న్యూఢిల్లీ/లక్నో: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన ‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించకపోవడంతో రానున్న...
04-06-2019
Jun 04, 2019, 20:13 IST
సొంత పార్టీని ఇరుకునపెట్టేవిధంగా ప్రవర్తించిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌పై అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top