అనంతలో తటస్థులతో వైఎస్‌ జగన్ భేటీ

 YS Jagan mohan reddy Meets Neutral Influencers at anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : ‘అన్న పిలుపు’లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తటస్థులతో సమావేశం అయ్యారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న తటస‍్థులతో ఆయన నగరంలోని  శ్రీ 7 కన్వెన్షన్‌ హాలులో ముఖాముఖి నిర్వహించారు. ప్రతి జిల్లాలోనూ ఏ రాజకీయ పార్టీకి చెందని తటస్థ వర్గాలతో స్థానిక సమస్యలు, సమాజంలోని ఇతర అంశాలపై  సమస్యలను ఆసక్తిగా తెలుసుకుని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే మేలు గురించి వైఎస్‌ జగన్‌ వివరించారు.

ఈ సమావేశం అనంతరం ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో ‘సమర శంఖారావం’ సభలో పాల్గొంటారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో సమర శంఖారావం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top