కపిల్‌ను టార్గెట్‌ చేసిన మోదీ | Why doesn't Congress sack Kapil Sibal too : Modi  | Sakshi
Sakshi News home page

కపిల్‌ సిబల్‌ను ఎందుకు తొలగించరు?

Dec 8 2017 5:38 PM | Updated on Aug 21 2018 2:39 PM

Why doesn't Congress sack Kapil Sibal too : Modi  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. సుప్రీంకోర్టులో అయోధ్య వ్యవహారాన్ని మరింత ముందుకు జరపాలని కోరిన కపిల్‌ సిబల్‌పై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. మణిశంకర్‌ అయ్యర్‌ను తొలగించినట్లుగా కపిల్‌ సిబల్‌ను ఎందుకు తొలగించరని ఆయన ప్రశ్నించారు.

ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆయనను తొలగించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టులో రామ్‌ మందిర్‌ విషయం విచారణ జరుగుతున్న సందర్భంలో ఆ కేసును 2019 సాధారణ ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ఇరుకున పడిన కాంగ్రెస్‌ ఆయనను గుజరాత్‌ ఎన్నికల ప్రచారానికి దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కలోల్‌ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న మోదీ ఎందుకు సిబల్‌ ఎన్నికలకు రామ్‌మందిర్‌కు ముడిపెట్టారని ప్రశ్నించారు. మణిశంకర్‌ మీద తీసుకున్న చర్యలే సిబల్‌పై ఎందుకు కాంగ్రెస్‌ పార్టీ తీసుకోలేదని ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement