దొంగే దొంగా.. దొంగా అంటున్నాడు!

vijayasai reddy slams tdp on pedalandariki illu schemeys jagan mohan reddy - Sakshi

సాక్షి, అమరావతి:  పేదలందరికీ ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పగ సాధించడమే కాకుండా, దొంగే దొంగా దొంగా అని అరచినట్లు తెలుగుదొంగల పార్టీ  నిరసన దీక్షలకు దిగుతుందట అంటూ వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి గురువారం విమర్శలు గుప్పించారు.  ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.(చైనా బలగాలు వెనక్కు)

టీడీపీ నాయకులు పట్టాల పంపిణీని వాయిదా వేయకుండా తక్షణమే ఇవ్వాలనే డిమాండు చేస్తున్నారని చెప్పారు. నాడు అడ్డుకున్న వాళ్లే నేడు ఇవ్వాలని అడుగుతూ సిగ్గు విడిచిన రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. (చైనా ర‌హ‌స్య క్యాంపుల్లో మ‌హిళ‌ల‌పై అత్యాచారం)

నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయడం లేదని పచ్చ పార్టీ నేతలు ఆందోళనకు దిగడంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కడిగిపారేశారని చెప్పారు. చంద్రబాబు ఎక్కడ హర్ట్ అవుతాడోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సైలెంట్​ అయ్యారని తెలిపారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు సిద్ధమైన దగ్గరి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకు టెన్షన్​ పట్టుకుందని విమర్శించారు.

ఐదేళ్లుగా అయ్యతో కలిసి ఐదు లక్షల కోట్ల రూపాయలు తిన్న గిత్త ఐదు నెలలుగా నోరు కట్టుకుని ఐదు కేజీలు తగ్గిందని మరో ట్వీట్​ చేశారు. దాని పేరు మాత్రం తనను అడగొద్దని కోరారు. ఆరోగ్య శ్రీ ద్వారా కరోనా ట్రీట్​మెంట్​ను ఉచితంగా అందిస్తున్న ఏకైక సర్కారు ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డిదేనని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని నివారించేందుకు విధివిధానాలను కూడా ఏపీ ప్రభుత్వం జారీ చేసిందని వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top