‘ఇంత దిగజారి పోయారేంటి బాబు?’ | Vijayasai Reddy Slams Chandrababu Naidu About Reverse Tenders | Sakshi
Sakshi News home page

రివర్స్‌ టెండరింగ్‌తో బాబు అవినీతి బట్టబయలు

Sep 26 2019 12:28 PM | Updated on Sep 26 2019 1:56 PM

Vijayasai Reddy Slams Chandrababu Naidu About Reverse Tenders - Sakshi

సాక్షి, అమరావతి: రివర్స్‌ టెండరింగ్‌ ప్రకియ వల్ల చంద్రబాబు నాయుడు అవినీతి సాక్ష్యాధారలతో సహా బయటపడుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘రివర్స్ టెండర్లతో మీ అవినీతి బాగోతం సాక్ష్యాధారాలతో బయట పడుతోంది. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా రాసే బోగస్ వార్తలకు రెస్సాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా.. బాబు. టెండర్లలో పాల్గొనద్దని కాంట్రాక్టు సంస్థలను బెదిరిస్తున్నారట. మరి ఇంత దిగజారి పోయారేంటి చంద్రబాబు గారు’ అంటూ విజయ్‌సాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

పోలవరంలో మూడు పనులకే ఇప్పటి వరకు టెండర్లు పూర్తయ్యాయని.. 50కి పైగా ఇరిగేషన్‌ పనులు టెండర్లకు రానున్నాయని విజయ్‌సాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు బానిసలు చూడాల్సింది ఇంకా చాలా ఉందని విజయ్‌సాయి రెడ్డి స్పష్టం చేశారు. ‘పోలవరంలో మూడు పనులకే టెండర్లు పూర్తయ్యాయి. చంద్రబాబు బానిసలు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. విద్యుత్తు పీపీఏల సమీక్షతో ఏటా వేల కోట్లు ఆదా అవుతాయి. ఇంకా 50కి పైగా ఇరిగేషన్ పనులు టెండర్లకు రానున్నాయి.ప్రజా ధనాన్ని ఇంత విచ్చల విడిగా, పబ్లిగ్గా దోచుకోవడం ఎక్కడా కనబడదు’ అంటూ విజయ్‌సాయి రెడ్డి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement