‘ఆ మురిసిపోవటం ఏంటి బాబుగారూ?’

Vijayasai Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిపై  వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. శనివారం ట్విటర్‌ వేదికగా తనదైన శైలిలో చంద్రబాబు, నారా లోకేష్‌లపై సెటైరిక్‌గా విమర్శలు చేశారు. ‘‘భ్రమరావతి అనే ‘ప్రపంచ నంబర్‌ వన్’ రాజధానిలో ఉన్న నాలుగు భవనాలకు స్వాతంత్ర దినోత్సవం రోజు లైటింగ్ ఏర్పాటు చేస్తే ఇంతగా మురిసి పోవడం ఏమిటి బాబుగారూ? కరకట్ట అక్రమ నివాసం మునిగిపోవడం, తమరు హైదరాబాద్ పలాయనం చిత్తగించడం. దేవుడు రాసిన అసలు స్క్రిప్ట్. మీరు దోచుకున్న సొమ్ము నుంచి అన్నక్యాంటీన్ల బకాయిలు వంద కోట్లు చెల్లిస్తే ఇప్పుడే క్యాంటీన్లు తెరుచుకుంటాయి. రెండు లక్షలు ఖర్చయ్యే షెడ్డుకు 30-40 లక్షలు దండుకున్నారు. ఆ డబ్బును తిరిగిచ్చినా క్యాంటీన్లు ఐదేళ్ల పాటు నడుస్తాయి. కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తే ప్రయోజనం ఏమీ ఉండదు.

మాజీలైన మంత్రులు కొందరు బాబు అక్రమ కొంపకు వాచ్‌మెన్లలాగా కాపలా కాయడం ఏమిటి? కర్మ కాకపోతే. ముంపు ప్రాంతాలను డ్రోన్లతో ఎలా చిత్రీకరిస్తారని మీడియాను దబాయిస్తున్నారు. లింగమనేని ఇంటి గురించి ఆందోళన మానేసి లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయపడండి బాబూ. లోకేశ్ ‘పెద్ద మనిషయ్యాక’ ఇంత పెద్ద వరదను చూసి ఉండడు. వానలు లేకున్నా7 లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో అంతుబట్టడం లేదతనికి. వరదలో కొట్టుకొచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహ పడుతున్నాడు. ఇరిగేషన్ వారితో కౌన్సిలింగ్ ఇప్పించండయ్యా. బేసిక్ నాలెడ్జన్నా పెరుగుతుంది. పప్పు, మాలోకం అంటూ సోషల్ మీడియా ఎందుకు కితకితలు పెడుతుందో అర్థమైందిగా. చంద్రబాబు ఇల్లు మునగాలని (కొట్టుకొచ్చిన) పడవను బ్యారేజి గేట్లకు అడ్డం పెట్టామట. 70 గేట్లు తెరిచినా నీరు వెనక్కి తన్నుతుంటే అందులో కుట్ర యాంగిల్‌ కనిపించింది. మామూలు బ్రెయిన్ కాదు మాలోకానిది’’ అంటూ ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top