‘కియా ఫ్యాక్టరీ వద్ద భూకుంభకోణం’

Vijaya Sai Reddy Says Land Scam At Kia Motors Anantapur - Sakshi

సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా పెనుగొండ కియా ఫ్యాక్టరీ వద్ద భూకుంభకోణం జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ‘ఈ కుంభకోణం వెనుక టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె ఇద్దరు సోదరులు, మరిది సూత్రధారులుగా ఉన్నారు. పేద రైతులను బలవంత పెట్టి ఎకరానికి 30 వేల రూపాయల కంటే తక్కువకే కొనుగోలు చేశారు. కియా ప్రాంతంలోని భూములన్నీ పరిటాల బినామీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ధర్మవరం ఎమ్మెల్యే సూరి కియా పుణ్యమా అని వందల కోట్ల రూపాయలు ఆర్జించార’ని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరో ట్వీట్‌లో..‘కియా భూకుంభకోణంతో కాల్వ శ్రీనివాసులతోపాటు నలుగురు ఎమ్మెల్యేలు కోటీశ్వరుల జాబితాలో చేరారు. అనుబంధ పరిశ్రమల వాళ్లు ఎకరం 2 కోట్ల రూపాయలకు కొనాలా. ఎడారి నేల నుంచి కోట్ల రూపాయలు ఎలా అర్జించవచ్చో టీడీపీ నేతలకు తెలుసు. దోచుకున్న సొత్తుతో అనంతపురంలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 500 కోట్ల రూపాయలు వెదజల్లి గెలవాలనేది చంద్రబాబు స్కెచ్‌’ అని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top