రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి

upendra Tweet On Karnataka Assembly Elections - Sakshi

యశవంతపుర : రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు, నటుడు ఉపేంద్ర అభిమానులు, మద్దతుదారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర ట్వీట్‌ చేసి కొందరికి చెవులను పిండారు. జరిగిందంత మంచికే జరిగిందంటూ బుధవారం జరిగిన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ట్వీట్‌ చేశారు. బీజేపీని ఆహ్వానించటంపై  ఆ మాట అన్నారా లేక కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాక పోవటానికి ఆ మాట అన్నారా అనేది గందరగోళం నెలకొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top