చంద్రబాబుకు ఉండవల్లి సూటి ప్రశ్న

Undavalli Arun Kumar Critics Chandrababu Naidu Over Govt White Paper - Sakshi

టీడీపీ శ్వేతపత్రంపై చర్చించాలని సవాల్‌

సాక్షి, రాజమండ్రి : శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల్ని మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మండిపడ్డారు. 10 రోజులు అమరావతిలోనే ఉంటానని దమ్ముంటే టీడీపీ ప్రభుత్వ శ్వేతపత్రంపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ‘ఓవైపు ఏపీ టాప్‌లో ఉందంటూ శ్వేతపత్రంలో గొప్పలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ మోసం చేసిందని అంటున్నారు. ఈ రెండింటికి లింక్‌ ఎలా కుదురుతుంది’ అని సూటిగా ప్రశ్నించారు. శ్వేతపత్రంలో ఉన్న నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అన్నారు. శ్వేతపత్రంలోని అంశాలు నిజాలే అయితే చర్చ పెట్టండి అని పునరుద్ఘాటించారు. చర్చలో తనది తప్పని తేలితే క్షమాపణ చెప్తానని పేర్కొన్నారు. ఏం అంశంపై అయినా తప్పులు మాట్లాడి చంద్రాబాబు దొరికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్ని ఇంకా మాయ చేయాలని చూస్తే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అది మధ్యాహ్న భోజన పథకంలోని ఆహారమే..
అన్నా క్యాంటిన్‌ భోజనం మధ్యాహ్న భోజన పథకంలోనే తయారు చేస్తున్నారని ఆరోపించారు. అన్నా క్యాంటిన్‌ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చయితే.. యభై లక్షలుగా చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తున్నాయనే పోలవరం, అమరావతి నిర్మాణాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top