2 ఓట్లతో గెలుపు.. లాటరీలో అనూహ్య ఫలితం

Twist In Armoor Pipri MPTC Result - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆర్మూరు మండలం పిప్రిలో ఓట్ల లెక్కింపులో వింత పరిస్థితి నెలకొంది. తొలుత ఓ అభ్యర్థి గెలవగా.. రీ కౌంటింగ్‌లో పరిస్థితులు మారిపోయాయి. చివరకు విజేత ఎవరో తెలుసుకోవడానికి లాటరీ తీయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తొలుత పిప్రికి సంబంధించి అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టగా రెండు ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. వారి విజ్ఞప్తి మేరకు అధికారులు రీకౌంటింగ్‌ చేపట్టారు. ఈ సారి అధికారులు ఓట్లు లెక్కించగా టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు(690) వచ్చాయి. దీంతో విజేత ఎవరో తెలుసుకోవడానికి అధికారులు లాటరీ తీయగా.. బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. దీంతో అధికారులు బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వను గెలిచినట్టు ప్రకటించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top