గుర్తింపు కార్డులివ్వాలి

TRS activists should be given identity cards - Sakshi

టీఆర్‌ఎస్‌కు ఉద్యమకారుల వినతి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో చేర్చాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం కన్వీనర్‌ మరుపల్ల రవి ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ కె.కేశవరావును బుధవారం కలసి వినతిపత్రం సమర్పించా రు. ‘టీఆర్‌ఎస్‌ అధినేతగా కేసీఆర్‌ ఎప్పుడు పిలుపు ఇచ్చినా ఉద్యమం చేశాం. కేసులు నమోదై జైళ్లకు వెళ్లాం. అయినా తెలంగాణ సాధించిన ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యమంలో కేసుల నమోదు, రిమాండ్, బెయిల్, కోర్టు కేసులు తదితర అంశాల ఆధారంగా పోలీసుల రికార్డుల ప్రకారం ఉద్యమకారులను గుర్తించి గుర్తింపుకార్డులు ఇవ్వాలి. ఉద్యమకారులందరినీ సమరయోధులుగా గుర్తించి నెలకు రూ.10 వేల పెన్షన్‌ మంజూరు చేయాలి. అర్హులైన విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యతనివ్వాలి’ అని కోరారు. అన్ని అంశాలను కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని కేశవరావు ఉద్యమకారులకు తెలిపారు.

నీరాను ప్రభుత్వమే విక్రయించాలి: గౌడ సంఘం
ఔషధ గుణాలున్న కల్లును నీరాగా అభివృద్ధి చేసి ప్రభుత్వమే బాటిలింగ్‌ చేసి విక్రయించాలని సర్వా యి పాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘం) టీఆర్‌ఎస్‌కు విజ్ఞప్తి చేసింది. కల్లు గీత కార్మికుల సంక్షేమంపై మేనిఫెస్టోలో చేర్చాలని కోరింది. గౌడ ఫెడరేషన్‌ ఏర్పాటుకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. గౌడ సంఘం నేతలు ఈడిగ ఆంజనేయులుగౌడ్, మల్లాగౌడ్, సునీల్‌గౌడ్‌ బుధవారం టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ కేశవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో 80 లక్షల మంది కల్లుగీత కార్మికులు ఉన్నారని, వీరికి 20% రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో పది ఎకరాల స్థలం కేటాయించి హరితహారం కింద హైబ్రిడ్‌ చెట్లను నాటాలని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top