కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ

Telangana Lok Sabha Elections: Main War Will Be Between Congress And Bjp - Sakshi

సాక్షి, కొడిమ్యాల(చొప్పదండి): లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ది ఎక్స్‌ట్రా ప్లేయర్‌ పాత్రేనని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం అన్నారు. కొడిమ్యాలలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పదవి కోసం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి తప్పదన్నారు. కేసీఆర్‌ అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. బోయినపల్లి వినోద్‌కుమార్‌ తన పదవీకాలంలో ఢిల్లీకే పరిమితమయ్యారని, ప్రజాసమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. తన సొంత మెడికల్‌ కాలేజీ కోసం జిల్లాకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్‌ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌ను ఎంతో అభివృద్ధి చేశారని, ఈసారి ఎంపీగా గెలిపించుకోవాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ చిలివేరి నారాయణగౌడ్, మాజీ సర్పంచ్‌ పిడుగు ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ గడ్డం జీవన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, సాయి, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top