కౌంటింగ్‌ నాడు టీడీపీ భారీ స్కెచ్‌..

TDP Plot to Dispute Counting Processes - Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల కౌంటింగ్‌ రోజున పెద్ద ఎత్తున గొడవలకు తెరలేపేందుకు అధికార తెలుగుదేశం పార్టీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ ఇవ్వడంతో ఆ పార్టీ వ్యూహం బట్టబయలైందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి అభ్యర్థికి మెజారిటీ వస్తే ప్రతిరౌండ్‌లోను  రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేయాలని టీడీపీ తన కౌంటింగ్‌ ఏజెంట్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు కౌంటింగ్‌ అధికారులతో గట్టిగా ఒత్తిడి చెయ్యాలని టీడీపీ నేతలు ఏజెంట్లను ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోంది.

మూడు రోజుల పాటు కౌంటింగ్ ఏజెంట్లకు ఇచ్చిన శిక్షణలో ఇదే విషయాన్ని గట్టిగా టీడీపీ నాయకత్వం  నూరిపోసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఏజెంట్ల బుక్‌లెట్‌లోనూ ఇదే విషయం ఉండటం టీడీపీ దురాలోచనను బయటపెట్టింది. ఓడిపోయేచోట కౌంటింగ్ ప్రక్రియ వివాదాస్పదం చేసి.. గొడవలకు తెరలేపాలని పార్టీ ఏజెంట్లకు టీడీపీ నాయకత్వం తప్పుడు సలహాలు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఎన్నికల కౌంటింగ్‌ రోజున గొడవలకు టీడీపీ స్కెచ్ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top