మార్చిలో రజనీ రాజకీయ యాత్ర..

super star rajinikanth political yatra starts in march - Sakshi

సాక్షి, చెన్నై: మార్చి నెల నుంచి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ యాత్ర ప్రారంభమౌతున్నట్లు సమాచారం. రాష్ట్ర పర్యటనపై రజనీ కసరత్తులు చేస్తున్నారు.  ఫిబ్రవరి చివరిలోపు మక్కల్ మండ్రమ్‌ జిల్లా కన్వీనర్లను సూపర్‌ స్టార్‌ నియమించనున్నారు. మక్కల్ మండ్రమ్‌ కార్యదర్శిగా రాజూ మహాలింగం నియమితులయ్యారు. 

చెన్నైలో రాజకీయ పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. రజనీ కాంత్‌ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ కూడా రాజకీయ పార్టీ ప్రకటనకు కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Back to Top