నా నెత్తుటి దాహంతో కాంగ్రెస్‌ ఉంది: సీఎం

Shivraj Singh Chouhan Fires on Congress - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జన ఆశీర్వాద్‌ యాత్ర చేపడుతున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌ బస్సుపై రాళ్లదాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. రథం తరహాలో రూపొందించిన బస్సులో ఆయన యాత్ర చేపడుతుండగా.. సిద్ది ప్రాంతంలో ఆదివారం (సెప్టెంబర్‌ 2న) కొంతమంది ఆయన బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో తొమ్మిదిమందిని అరెస్టు చేసినట్టు హోంమంత్రి భూపేందర్‌సింగ్‌ తెలిపారు.

అయితే, ఈ ఘటనకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీయే కారణమని సీఎం చౌహాన్‌ ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌ పార్టీ నా రక్తదాహంతో ఉంది’  అని ఆయన మండిపడ్డారు. ‘మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటుచేసుకోలేదు. భావజాలపరమైన పోరాటాలు మాత్రమే ఇప్పటివరకు కొనసాగాయి. రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించుకోనేవి. కానీ ఇలాంటివి (రాళ్ల దాడి) ఎప్పుడూ జరగలేదు’ అని ఆయన సోమవారం మీడియాతో అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top