షాట్‌గన్‌ వర్సెస్‌ రవిశంకర్‌ ప్రసాద్‌?

Shatrughan Sinha Vs Ravishankar Prasad in Patna Sahib - Sakshi

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని పట్నా సాహీబ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తిరుగుబాటుదారుడు శతృఘ్నసిన్హాని పోటీ చేయించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ఇదే విషయం బిహార్‌ రాజకీయాలను కుదిపేస్తోంది. పట్నా సాహీబ్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ని నిలబెడుతున్న తరుణంలో కాంగ్రెస్‌ శతృఘ్నసిన్హాను ముందుకు తెస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పట్నా సాహీబ్‌ నుంచి ఎట్టిపరిస్థితుల్లో పోటీచేసి తీరుతానని ఇప్పటికే శతృఘ్న ప్రకటించారు.

‘షాట్‌ గన్‌’గా అభిమానులు పిలుచుకునే శతృఘ్న బీజేపీ ప్రస్తుత ఎంపీ అయినా.. కొన్నేళ్లుగా బీజేపీపై, మోదీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గత వారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హాజరై, రవిశంకర్‌ప్రసాద్‌ను ఇక్కడ నిలబెట్టాలని చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఆర్కే సిన్హా పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవలే పార్టీని వీడిన బీజేపీ మాజీ నేత, క్రికెటర్‌ కీర్తీ ఆజాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేయవచ్చని తెలుస్తోంది. కీర్తీ ఆజాద్‌ బిహార్‌లోని దర్భంగ నియోజకవర్గానికి బీజేపీ తరఫున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top