ఆ అవార్డ్‌ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం కాదా? | Sharad Pawar Fires on PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ఆ అవార్డ్‌ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం కాదా?

Oct 9 2019 8:11 PM | Updated on Oct 9 2019 8:48 PM

Sharad Pawar Fires on PM Narendra Modi - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా పవార్‌ మాట్లాడుతున్నారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. తాను దేశానికి కట్టుబడి లేకపోతే.. పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటే తనకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ ఎందుకిచ్చినట్టని ప్రశ్నించారు. ఆ అవార్డ్‌తో సత్కరించింది బీజేపీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. ఓవైపు తనను పద్మ విభూషణ్‌ ఇచ్చి.. మరోపక్క తనపై వేలెత్తి చూపడం దేనికని ఎండగట్టారు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇంత అయోమయం పనికి రాదని ప్రధాని మోదీపై పవార్‌ ఘాటు విమర్శలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement