
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆడపిల్లను బయటకు పంపి చదివించగలమనే భరోసా దిశ చట్టం, అమ్మఒడితోనూ కలిగిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంను సమర్థిస్తూ భీమవరంలో సోమవారం ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా శివాజీ మాట్లాడుతూ.. మాతృబాషను పరిరక్షించుకుంటూనే ఇంగ్లీష్ మీడియం కావాలని ఉద్యమాన్ని చేపట్టామన్నారు. రూ. 5 కోట్లు ఇస్తే అమరావతిలో రాజధాని అవసరం లేదా అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరికి న్యాయం చేస్తారని, అమరావతిలో రాజధాని నిర్మించడానికి అక్కడ ఎలాంటి వసతులు లేవన్నారు. రాజధాని అభివృద్ధి చెందాలంటే 25 సంవత్సారాలు పడుతుందని, విశాపట్నం అన్ని విధాల అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.