చంద్రబాబు దళితుల ద్రోహి | Samata Sainik Dal Supports To YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దళితుల ద్రోహి

Mar 29 2019 12:40 PM | Updated on Mar 29 2019 12:40 PM

Samata Sainik Dal Supports To YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దళితుల ద్రోహి అని సమతా సైనిక్‌దళ్‌ (ఎస్‌ఎస్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు పాలిటి మహేశ్వర రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బాబు పాలనలో దళితుల మీద విపరీతంగా దాడులు జరిగాయని అన్నారు. ఎస్సీ లు గా పుట్టాలని ఎవరు కోరుకుంటారని స్వయంగా చంద్రబాబే చెప్పాడు అని చెప్పారు. అన్ని జిల్లాల్లో దళితుల మీద టీడీపీ నేతుల  దాడులు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.

వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పాలని సమత సైనిక దళ్ నిర్ణయించిందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే దళితుల జీవితాలు బాగుపడతాయన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అండగా ఉంటామని, వైఎస్‌ జగన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement