
సాక్షి, కృష్ణా: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఓడించాలని కోరుతూ సమతా సైనిక్ దళ్ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. దళిత, మైనార్టీ, మహిళలు, బహుజన వ్యతిరేకి అయిన చంద్రబాబును ఓటమే లక్ష్యంగా సమతా సైనిక్ దళ్ కడప నుంచి వైజాగ్ వరకు బస్సు యాత్ర చేపట్టింది. మంగళవారం ఈ బస్సు యాత్ర కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం చేరుకుంది. టీడీపీని ఓడించడం దళిత, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు చారిత్రక అవసరం అని వారు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ బస్సు యాత్ర చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ విక్టర్ ప్రసాద్‌లతో పాటు రాష్ట్ర కార్యవర్గం పాల్గొంది.