సచిన్‌పై యూనస్‌ ఖాన్‌ పోటీ!

Sachin Pilot And Yoonus Khan COntest Form Tonk - Sakshi

టోంక్‌ స్థానం నుంచి బరిలో సచిన్‌ పైలెట్‌,  మంత్రి యూనిస్‌ ఖాన్‌

46 ఏళ్ల తరువాత ముస్లిమేతర అభ్యర్థికి కాంగ్రెస్‌ టికెట్‌

జైపూర్‌ : ఉత్కంఠ పోరుకు వేదికగా మారిన రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. దానిలో భాగంగా కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న పీసీసీ చాఫ్‌ సచిన్‌ పైలెట్‌పై ముస్లిం నేత, మంత్రి యూనిస్‌ ఖాన్‌ను బరిలో దింపింది. రాజస్తాన్‌లో అత్యధికంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన టోంక్‌ స్థానంలో వీరిద్దరు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మొదటి నుంచి బలమైన క్యాడర్‌ ఉన్న ఈ స్థానంలో 1972 నుంచి ముస్లిం అభ్యర్థినే బరిలో నిలుపుతూ వచ్చింది. బీజేపీ కూడా గత నాలుగు దశాబ్దాల నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్న అభ్యర్థినే పోటీలో నిలిపేంది. కాగా నలభై ఆరేళ్ల తరువాత కాంగ్రెస్‌ తొలిసారి ముస్లిమేతరులకు టికెట్‌ కేటాచించడం గమనార్హం.

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో రెండు పార్టీలు అభ్యర్థులను మార్చాయి. దీంతో ఈ నియోజకవర్గంపై రాజకీయం రసవత్తరంగా మారింది. నలభైఏళ్ల సాంప్రదాయానికి చెక్‌పెట్టిన కాంగ్రెస్‌ సచిన్‌ను బరిలోకి దింపడంతో.. చివరి నిమిషంలో తేరుకున్న బీజేపీ మైనార్టీల ఓట్లను దండకుంనేందుకు ముస్లిం అభ్యర్థిని బరిలో నిలిపింది. యూనిస్‌ ఖాన్‌ వసుంధర ప్రభుత్వంలో రవాణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సోమవారం నామిషన్లకు చివరి రోజు కావడంతో బీజేపీ విడుదల చేసిన ఐదో జాబితాలో ఆయన పేరును ఖరారు చేసింది.  గత ఎన్నికల్లో బీజేపీ తరుఫున కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top