నాన్న ఆశయ సాధనకు నా జీవితం అంకితం: వైఎస్‌ జగన్‌

Remembering nanna on his vardanthi. His ideals have been a guiding light, Tweets YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆ మహానేతను ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. ‘వర్ధంతి సందర్భంగా నాన్నను గుర్తుచేసుకుంటున్నాను. నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం. ఆయన ఆశయ సాధన కోసం నా జీవితాన్ని అంకితమిస్తాను’అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా అంతకుముందు వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరం శివారులోని పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం ఉదయం మహానేత విగ్రహానికి పూలమాల అర్పించి.. వైఎస్‌ జగన్‌ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ వెంట ఉన్న నేతలు, పార్టీ కార్యకర్తలు ‘జోహార్‌ వైఎస్సార్‌’ అంటూ నినాదాలు ఇచ్చారు.  అనంతరం జననేత వైఎస్‌ జగన్‌ 252వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top